Sunday, April 28, 2024

TS: గృహజ్యోతి పథకం.. ప్రజలకు వరం… ఎమ్మెల్యే పాయం

అశ్వాపురం, మార్చి 5 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఓ వరం లాంటిదని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండల కేంద్రమైన అశ్వాపురం ఎస్సీ కాలనీలో సోమవారం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఓ ఇంటి యజమానికి జీరో బిల్లును కొట్టి సంబంధిత వినియోగదారు అందజేశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ… గృహజ్యోతి పథకం అమలు చేయడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రభుత్వం గృహజ్యోతి పథకంపై ఎంత ఖర్చైనా వెనుకాడకుండా అమలు చేస్తుందన్నారు. గృహ అవసరాల కోసం విద్యుత్ శాఖ అధికారులు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరాల నిలిపివేయటం చేయరాదన్నారు. విద్యుత్ పరంగా వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత సిబ్బందికి ఫోన్ చేస్తే ఫోన్ కాల్ పై తప్పకుండా స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెలకు ఉచితంగా అందిస్తున్న 200యూనిట్ల కరెంటును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజన్ ఎలక్ట్రికల్ ఏ డి ఈ జీవన్ కుమార్, అశ్వాపురం ఏఈ శ్రీనివాసరావు, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యుత్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు..

- Advertisement -

మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఇవాళ అశ్వాపురం మండలానికి విచ్చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి టెంకాయలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement