Friday, May 3, 2024

KHM: ప్రభుత్వ వైద్యశాలల్లోనే మెరుగైన వైద్యం : డీఎం అండ్ హెచ్ఓ లక్ష్మీ శిరీష

చంద్రుగొండ, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్): ప్రభుత్వ వైద్యశాలల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎం అండ్ హెచ్ఓ లక్ష్మీ శిరీష తెలిపారు. చంద్రుగొండ ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. గర్భిణీ స్త్రీల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు అవసరమైన ఐరన్, క్యాల్షియం తదితర మందులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు గర్భిణీలు ప్రభుత్వ వైశాలో పరీక్షలు నిర్వహించుకోవాలని, అవసరమైతే సమీపంలోని మాత శిశు కేంద్రానికి వెళ్లి తగు సలహాలు, పరీక్షలు చేయించుకోవాలన్నారు.

సాధారణ కాన్పుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు తమ వంతుగా కృషి చేస్తారని, ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అది జన్యుపరమైన లోపాలు, జబ్బులు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయన్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం కోసం వెళ్లకుండా ఉండటమే మంచిదన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్యులకు సహకరించాలన్నారు. ఈ ఏడాది చంద్రుగొండ మండలంలో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ సుకృత, డాక్టర్ కనకం తనూజ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement