Monday, May 6, 2024

Khammam | అజయ్ నుండి ఖాన్ ను వేరు చేయలేరు: మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరం : ఖమ్మం ముస్లిం మైనారిటీలు నాపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో 10ఏళ్ల క్రితమే నన్ను అజయ్ ఖాన్ గా తనను ముస్లింలు సొంతం చేసుకున్నారని, అజయ్ నుండి ఖాన్ ను వేరు చేయడం ఎవ్వరి వల్లకాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని 40వ డివిజన్ మోమినాన్ లో జరిగిన ఖురేషి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు

. ఖమ్మంలో గడచిన 10 ఏళ్లలో నాతో ముస్లిం సోదరులకు ఉన్న అవినాభావ సంబంధం మీరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదన్నారు. ఖమ్మం నా ఇళ్లు.. ఇక్కడ ప్రజలు నా కుటుంబ సభ్యులు అని అన్నారు. ఖమ్మంలో కొత్త బిచ్చగళ్లు తయారయ్యారని, టోపీలు పెట్టుకుని వచ్చి విష కౌగిలితో మిమ్మల్ని మోసం చేయడానికి పయనం అయ్యారని అన్నారు. కొందరు అడేగాళ్లు.. బుడె గళ్ళను వెంటేసుకుని నన్ను మీకు దూరం చేస్తామని సవాల్ చేస్తున్న వారికి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా వారి ప్రయత్నం వృధా అని తెలుసుకుంటే మంచిదన్నారు.


మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానంకు నేనెప్పుడూ కృతజ్ఞుడను అని, మీ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకుంటూ వస్తున్నా అని అన్నారు. ప్రతి పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుతం నుండి వచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అందించామని, ఆడపిల్ల పెళ్ళి జరిగిన ఇంట్లో నేనే స్వయంగా వచ్చి షాది ముభారక్ పథకం ద్వారా రూ.లక్ష చెక్కును అందజేసిన విషయం గుర్తు చేశారు.
ఒకప్పుడు త్రాగునీటి కొసం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకున్నారని కానీ నేడు ప్రతి ఇంటికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగునీరు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక సంక్షేమ పథకాలు మీకు వర్తించే విధంగా నిరంతరం పని చేస్తున్నానని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ దాదే అమృతమ్మ సతీష్, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు దనలకోట సురేష్, గౌస్, నాయకులు మెహబూబ్ అలీ, షరీఫ్, హఫీజ్, ఖురేషి సంఘం అధ్యక్షుడు అయుబ్, ఇంతియాజ్, చోటు, గయాజ్, మహిళ అధ్యక్షురాలు ఖాజాభీ, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, జాని తదితరులు పాల్గొన్నారు ..

Advertisement

తాజా వార్తలు

Advertisement