Friday, May 17, 2024

8న కోకాపేట‌లో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి కెసిఆర్ భూమి పూజ‌

హైదరాబాద్ నగరానికి మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కట్టడం రాబోతోంది. కోకాపేట్ లో అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతి పెద్ద ఆలయాన్ని అంతర్జాతీయ కృష్ణ చైనత్య సంఘం (ఇస్కాన్) నిర్మించబోతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ నమూనాను ఇస్కాన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ కట్టడంలో శ్రీరాధాకృష్ణ టెంపుల్, శ్రీనివాస గోవింద టెంపుల్, రాజగోపురం, నిత్యాన్నదాన హాలు ప్రధానంగా ఉంటాయి. ఇటివ‌లే ఇస్కాన్ ప్రతినిధులు నూతన సచివాలయంలో కేసీఆర్ ను కలిసిన శంకుస్థాపనకు ఆహ్వానించారు. దీనికి కెసిఆర్ ఆంగీకారం తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement