Wednesday, May 15, 2024

Delhi | వీఐపీ జోన్​లో దారుణం.. కారుతో బైకును గుద్దేసి, మూడు కిలోమీటర్లు లాక్కెల్లాడు!

ఢిల్లీలోని హైసెక్యూరిటీ వీఐపీ జోన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కారుతో బైకును గుద్దేయడమే కాకుండా.. కారు టాప్​పై పడిపోయిన వ్యక్తిని అలాగే మూడు కిలోమీటర్ల దూరం ఆగకుండా లాక్కెల్లిన అవామనవీయ ఘటన చోటుచేసింది. ఈ హిట్ అండ్ రన్ కేసులో ఓ యువకుడు చనిపోగా, అతని బంధువు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా ఓ వీడియో చానల్​ వ్యక్తి రికార్డు చేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి న్యూఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్, టాల్‌స్టాయ్ మార్గ్ సెంటర్​ వద్ద జరిగింది.

కాగా, మృతుడిని దీపాంశు వర్మ (30)గా గుర్తించారు. అతని బంధువు ముకుల్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. నగల దుకాణం యజమాని అయిన వర్మకు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరా ప్రకాం.. ఒక కారు బైక్‌ను ఢీకొట్టింది. ఆ తాకిడికి బైకుమీద ఉన్న ముకుల్ చాలా అడుగుల దూరం విసిరేసినట్టు పడిపోయాడు. ఈ క్రమంలో వర్మ కారు టాప్​ మీద పడిపోయాడు. అయితే.. దిగ్భ్రాంతికరంగా కారు డ్రైవర్ పరిస్థితిని గమనించి కూడా ఆగకుండా అలాగే స్పీడ్​గా వెళ్లిపోయాడు. ఇలా కారు టాప్​మీద ఉన్న వ్యక్తితో పాటు వేగంగా వెళ్లిపోయాడు.

ఈ సంఘటనను రికార్డ్ చేసిన మీడియా పర్సన్​ స్కూటర్‌పై వెంబడిస్తూ.. దూసుకెళ్లిన కారుని అనుసరించాడు. ఎంత హారన్‌ కొట్టినా, కేకలు వేసినా హిట్​ చేసిన వ్యక్తి కారును ఆపకుండా దూసుకెళ్లాడు. ఇలా దాదాపు 3 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత నిందితులు గాయపడిన వ్యక్తిని ఢిల్లీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. అయితే.. బాధితులు వర్మ, ముకుల్‌ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వర్మ చనిపోయాడు. ఈఘటనను పరిశీలించిన ఢిల్లీ పోలీసులు మర్డర్​ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను మాత్రం బయటికి చెప్పడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement