Thursday, May 2, 2024

స్టార్ హీరోల‌పై పొగ‌డ్త‌లు కురిపించిన.. న‌టి ఖుష్బూ

సినిమాల‌తో పాటు జ‌బ‌ర్ద‌స్త్ లో కూడా మెరిశారు సీనియ‌ర్ న‌టి ఖుష్బూ..ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, తాను నటించిన హీరోలను గురించి ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవి గారు లెజెండ్. సెట్లో ఆయనపడే కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. మెగాస్టార్ చిరంజీవి ..తాను ఏం చేసినా జనాలు చూస్తారు అని ఆయన అనుకోరన్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏం చేయాల‌ని ఆలోచన చేస్తుంటారు అన్నారు. ఇక నాగార్జునగారితో ఫస్టు మూవీగా స‌ కెప్టెన్ నాగార్జునస‌ చేశాను. అప్పటికే ఆయన చాలా స్టైలీష్ గా ఉండేవారు. ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ తెరపై ఆయనతో రొమాన్స్ చేయాలని కోరుకుంటారు. ఇక రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించాను. ఆయనను నేను బావా అని పిలుస్తుంటాను. ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే చాలా తక్కువగా మాట్లాడతారు .. ఆయన వ్యక్తిత్వం గొప్పది. కోలీవుడ్ లో కమల్ హాస‌న్ గారు నా స్వీట్ హార్ట్. ఇక రజనీకాంత్ సార్ గురించి మాట్లాడటానికి మాటాలు చాలవని చెప్పారు.ఇప్పుడీ వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement