Monday, May 6, 2024

Praja Ashirvada Sabha – అభివృద్ది, సంక్షేమానికి పెద్ద పీట‌వేసిన బిఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించండిః కెసిఆర్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)15: 9 ఏళ్ల బిఆర్ఎస్ రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. దేశం లోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నార ని… బీడీకార్మికుల సమస్యలను గుర్తించి బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్ర మేనని తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభా కార్యక్రమానికి కెసిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌లో రావాల్సిన ప‌రిణితి రాలేదు. ఇంకా కూడా కులం, మ‌తం పేరిట కొట్లాట‌లు, పంచా యితీలు, ఝూటా వాగ్దానాలు, ఆరోప‌ణ‌లు, అభాండాలు.. ఒక పిచ్చిపిచ్చిగా గ‌డ‌బిడి జ‌రుగు తుంది. దీనికి కార‌ణం ఏంటంటే ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌లో రావా ల్సిన ప‌రిణితి రాక‌పోవ‌డం. ఏయే దేశాల్లో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ ప‌రిణితి చెందిందో ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి..

అభ్య‌ర్థుల గుణగణాలు… వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచ‌న చేయాలి…
ప్ర‌తి ఎన్నిక‌లో ప్ర‌తి పార్టీకో మ‌నిషి నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్ త‌ర‌పున గణేష్ బిగాల నిల‌బ‌డ్డాడు. కాంగ్రెస్ త‌ర‌పున ఒకాయ‌న నిల‌బ‌ డ్డాడు. బీజేపీకి కూడా ఒక‌రు ఉంటారు. ఇండిపెండెంట్ ఒక‌రిద్ద‌రు ఉండొచ్చు. ఈ అభ్య‌ర్థుల గురించి ఆలోచ‌న చేయాలి. మంచి చెడ్డ‌వారు ఎవ‌రు అని ఆలోచ‌న చేయాలి. అభ్య‌ర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచ‌న చేయాలి. ఇక్క‌డ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్క‌డ ఆ గ‌వ‌ర్న‌మెంట్ ఏర్ప‌డ‌తుంది. మంచి గ‌వ‌ర్న‌మెంట్ రాక‌పోతే ఐదేండ్లు ఏం చేయ‌లేం. లేనిపోని ఇబ్బందులు వ‌స్తాయి. ఏ పార్టీకి అధికారం ఇస్తే ప్ర‌జ‌ల గురించి ఆలోచించార‌ని ఆలోచించి ఓటేయాలి. ప్ర‌జ‌లు గెల‌వ‌నంత వ‌ర‌కు దేశం అనుకున్నంత ముందుకు పోదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాతే నిజాంసాగ‌ర్‌కు పూర్వ వైభ‌వం

నిజాంసాగ‌ర్‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చిందికానీ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత నిజాంసాగ‌ర్‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చింది. పాత నిజాంసాగ‌ర్ ఎట్టుండ‌నే ఇప్పు డు సాగ‌ర్ అలా త‌యారైంది. నిజాం సాగ‌ర్ 365 రోజులు నిండే ఉంట‌ది. మీ పంట‌ల‌కు ఎటువండి డోఖా ఉండ‌దు. దాన్ని కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు లింక్ చేసుకున్నాం. సింగూరు నీళ్ల‌ను హైద‌రాబాద్‌కు బంద్ చేసినం. హైద‌రాబాద్‌కు గోదా వ‌రి నుంచి నీళ్లు తెచ్చాం. కాళే శ్వ‌రం జ‌లాలు మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాలు మీకు వ‌స్తాయి. పాత నిజామాబాద్ ఎలా క‌ళ‌క‌ళ‌లా డిందో మ‌ళ్లా అట్ల‌నే ఉంటుంది. 58 ఏండ్ల త‌ర్వాత బీఆర్ఎస్ సాధించిన విజ‌యం ఇది అని కేసీఆర్ తెలిపారు.

- Advertisement -

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ‌ ప్ర‌జ‌ల హ‌క్కుల కోసమే
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ‌ ప్ర‌జ‌ల హ‌క్కులు, నీళ్లు, నిధుల కోసం సీఎం కేసిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంది. మ‌రి ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో, 50 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఏం జ‌రిగిందో ఆలోచించాలి. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొ ట్టిందేవ‌రు..? తెలంగాణ మ‌న‌ది మ‌న‌కు ఉండే. మంచి పంట‌ల‌ తోని, నిజాం రాజులు, కాక‌తీ య రాజులు క‌ట్టించిన ప్రాజె క్టులు, చెరువుల‌తో చాలా బాగుం డే. తెలంగాణ ప్ర‌జ‌ల అభీష్టానికి వ్య‌తిరేకంగా ఏపీలో క‌లిపితే ఆ చిన్న త‌ప్పుకు 58 ఏండ్లు కొట్లాడాల్సి వ‌చ్చింది…

తెలంగాణ క‌ల్చ‌ర్ గంగా జ‌మునా తెహ‌జీబ్..

తెలంగాణ క‌ల్చ‌ర్ గంగా జ‌మునా తెహ‌జీబ్. హిందూ, ముస్లింలు అంద‌రూ సోద‌రుల్లా క‌లిసి ఉండి మొత్తం ప్ర‌పంచా నికి ఉదాహ‌ర‌ణ‌గా ఉంటు న్నాం. ప‌దేండ్ల‌లో ఒక్కసారంటే ఒక్క‌సారి కూడా క‌ర్ఫ్యూ లేదు, క‌ల్లోలం లేదు. బ్ర‌హ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్ ఆర్డ‌ర్ ప‌టిష్టంగా మెయింటెన్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యుల‌ర్ పార్టీ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు.

దేశ వ్యాప్తంగా 157 మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణ‌కు ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌లేదు. న‌వోద‌య పాఠ‌శాల‌లు ఇవ్వ‌లేదు. జిల్లాకో న‌వోద‌య పాఠ‌శాల ఉండాల‌న్న‌ చ‌ట్టాన్ని ఉల్లంఘించారు మోదీ. వంద సార్లు అడిగాను. ఒక్క న‌వోద‌య పాఠ‌శాల ఇవ్వ‌లేదు. బావుల కాడ మోట‌ర్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ని చెప్ప‌రు.. నేను పెట్ట‌లేదు. ఇందుకు ఐదేండ్ల‌కు రూ. 25 వేల కోట్లు క‌ట్ చేశారు. బ‌డ్జెట్ క‌ట్ చేసి, న‌వోద‌య‌, మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. ఇవ‌న్నీ ఆలోచిం చాలి. ఆలోచించి ఓటు వేయా లి. ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌ని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు.

గణేష్ బిగాల ను మెజారిటీతో గెలిపించండి…

గతంలో నిజామాబాద్ పట్టణం ఏ విధంగా ఉందో.. ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నూతన కలెక్టరేట్, ట్యాంక్ బండ్, ఐటీ హబ్, వైకుంఠ ధామాలు, నిజాంబాద్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో.. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న అర్బన్ అభ్యర్థి గణేష్ బిగాల ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజేశ్వేర్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు అలీమ్, నుడా చైర్మన్ సంజీవ రెడ్డి, వీజి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement