Monday, June 5, 2023

టీచర్ల బదిలీలకు,పదోన్నతులకు కెసిఆర్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌: ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కానుంది. ముందుగా హెడ్ మాస్టర్ ల బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా చేయనున్నారు . అలాగే 9 వేల 266 మందికి పదోన్నతులు కల్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement