Wednesday, May 1, 2024

Breaking: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌లోని ఆయన నివాసానికి కేసీఆర్‌ బయల్దేరి వెళ్లారు. కాగా.. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్‌కు… సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. యశోద నుండి నేరుగా నంది నగర్ లోని నివాసానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాంప్రదాయ పద్దతిలో దిష్టి తీసి హారతి పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రముఖులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement