Saturday, April 27, 2024

Pawan Kalyan: జ‌న‌సేన ప్ర‌చార విభాగం ఛైర్మ‌న్ గా బన్నీవాస్

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్‌గా బన్నీవాస్‌ను నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని బన్నీవాస్‌కు అందజేశారు జనసేనాని. ఇక, పార్టీకి ప్రచార విభాగం కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని సూచిస్తూ ఈ సందర్భంగా బన్నీ వాస్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాక్షంలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement