Wednesday, May 15, 2024

పోలీసులకు వెంకన్న నామాలు

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిత్యం విధినిర్వహణలో తలమునకలై ఉండే పోలీసులు సోమవారం నామాలతో దర్శనమిచ్చారు. కరీంనగర్ పద్మనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థలంలో టీటీడీ అర్చకులచే పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి నుండి మొదలు పోలీస్ అధికారుల వరకు వెంకన్న నామాలు నుదిటి పై పెట్టుకున్నారు. ఎంకన్న నామాలతో దేవాలయ స్థలంలో దుక్కిదున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement