Sunday, May 5, 2024

వల్లభాయ్‌ పటేల్‌ జీవితం ఆదర్శం

పెద్దపల్లి రూరల్‌ : ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జీవితం నేటి, భావితరాలకు ఆదర్శమని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి అన్నారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివస్‌ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ సిబ్బందిచే ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో మేనేజర్‌ శివప్రసాద్‌, ఎంఏఈ సతీష్‌, మనోహర్‌, అకౌటె-ంట్‌ సంతోష్‌, జూనియర్‌ అసిస్టెంట్లు రమాకాంత్‌, సురేందర్‌, సానిటరీ ఇన్స్పెక్టర్లు సంధ్య కుమారి, రామ్మోహన్‌ రెడ్డి, పులిపాక రాజు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement