Thursday, April 25, 2024

జాతీయ షూటింగ్ లో.. మేఘన సాధులకు మూడు పతకాలు

జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారిణిలు అత్యంత ప్రతిభ కనబరచడంతో పతకాలు సాధించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో తెలంగాణకు చెందిన మేఘనా సాదుల బ్రాంజ్ మెడల్ సాధించింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ సివిలియన్ క్యాటగిరి ఇండివిడ్యువల్ విభాగంలో మేఘన బ్రాంజ్ మెడల్ పొందింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ జూనియర్ మహిళ టీం విభాగంలో తెలంగాణ క్రీడాకారిణిలు మేఘనా సాధుల, ఇషా సింగ్, మాలబికా బార్వ సిల్వర్ మెడల్ సాధించారు. పథకాలు పొందిన క్రీడాకారులకు మధ్యప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి విజయరాజే సిందియా పతకాలు అందజేసి అభినందించారు. జాతీయ షూటింగ్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచి ఎక్కువ పతకాలు సాధించడం పట్ల తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మేఘన తండ్రి సారంగపాణి రామగుండం కమిషనరేట్ లోని పెద్దపల్లి ఏసిపిగా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement