Tuesday, April 30, 2024

ఆర్ఎఫ్ సీఎల్ బాధితుడి ఆత్మహత్యాయత్నం

పాలకుర్తి : పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన గంగుల శేఖర్ (28) అనే ఆర్ఎఫ్ సీఎల్ బాధితుడు అప్పుల బాధతో సోమవారం రాత్రి ఇంటి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) ఉద్యోగం కోసం దళారులకు అప్పు తీసుకుని వచ్చి రూ.7 లక్షలు ఇచ్చి చేరాడు. 6 నెలలు పనిచేసిన తర్వాత కాంట్రాక్టు మారడంతో కొత్త కాంట్రాక్టు ఉద్యోగం నుంచి తొలగించింది. కట్టిన డబ్బులు రాకపోవడమే కాకుండా తెచ్చిన అప్పులు తీర్చలేక నిరాశకు గురైన శేఖర్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు కరీంనగర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముంజ హరిష్ ఘటన మరువక ముందే మరో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం మండలంలో సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement