Tuesday, April 30, 2024

Odela: డబుల్ రోడ్డుకు రూ.36కోట్ల మంజూరు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞత ర్యాలీ..

ఓదెల, జూన్‌ 27 (ప్రభ న్యూస్‌): మండల కేంద్రం ఓదెలలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డికి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి నుండి వయా పెద్దబొంకూర్‌, కొత్తపల్లి, కొలనూర్‌ మీదుగా ఓదెల వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి 36 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు గాను మంగళవారం ఓదెల జగదాంబ సెంటర్‌ నుండి తారకరామ కాలనీ గేట్‌ వరకు డీజే బ్యాండ్‌తో ర్యాలీని చేపట్టారు. ఓదెల మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, మాజీ ఎంపీటీసీ బోడగుంట చిన్న స్వామిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తారకరామ కాలనీ వద్ద కొలనూర్‌ వెళ్లే రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్‌, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత దశాబ్దాల కాలంగా మండల కేంద్రం ఏర్పాటు నుండి కొలనూర్‌ పెద్దపల్లికి వెళ్లే దారి రోడ్డుమార్గం లేకపోవడంతో నాటి ప్రజా ప్రతినిధులు కానీ, పాలకులు కానీ పట్టించుకోలేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దాసరి మనోహర్‌ రెడ్డికి ఓదెల నుండి కొలనూర్‌ ద్వారా పెద్దపల్లికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత నాయకులు గత కొన్నేళ్లుగా మొర పెట్టుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే దాసరి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం నుండి 36 కోట్ల రూపాయల పెద్ద రోడ్డు ప్రాజెక్టును మంజూరు చేయడం ఓదెల ప్రజల అదృష్టమన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రేణుకాదేవి, పెద్దపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఐరెడ్డి వెంకట్‌ రెడ్డిలతో పాటు స్థానిక నాయకులు రమేష్‌, రామస్వామి పందేన నర్సింగము, కనిగిరి సతీష్‌, తీర్థాల కుమార్‌, బోడగుంట నరేష్‌, రాచర్ల కుమార్‌, మొగిలి, బుద్దే పోశెట్టి, వంగ రాయమల్లు, బోడిగుంట మహేందర్‌, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఎండి సర్వర్‌, రాచర్ల రాజేశం, గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement