Thursday, May 2, 2024

పి హెచ్ సి లో పీజీయోథెరపీ సేవలు – కలెక్టర్ కు కేటీఆర్ ప్రశంస

సిరిసిల్ల ,ఏప్రిల్ 12, (ప్రభ న్యూస్)తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పీజీయోథెరపీ సేవలు ప్రారంభమయ్యాయి.రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పీజీయోథెరపీ క్లినిక్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం PHC లో రాష్ట్ర మంత్రి కే తారక రామారావు లాంచనంగా ప్రారంభించారు.మంత్రి కే తారక రామారావు మార్గదర్శనం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవ తో ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.90 వేల తో ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఎలక్ట్రోథెరపీ వంటిపీజీయోథెరపీ పరికరాలను సమకూర్చి ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేశారు.సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో సేవలు అందించనున్నారు.ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు తో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిలో అందే సేవలు ప్రాథమిక స్థాయిలోనే ప్రజలకు లభించనున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పీజీయోథెరపీ సేవల పట్ల ట్విట్టర్ వేదికగా మంత్రి కే టి ఆర్ హర్షం వ్యక్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement