Saturday, May 18, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 46
46.
కిరీటినం గదినం చక్రహస్తమ్‌
ఇచ్ఛామిత్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో! భవ విశ్వమూర్తే ! ||

తాత్పర్యము : ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటమును ధరించి శంఖ, చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదును. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.

భాష్యము : భగవంతుడు వందల, వేల కొలదీ రూపాలలో శాశ్వతముగా వ్యక్తమగును. అందు రామ, నృసింహ, నారాయణ మొదలగునవి ముఖ్యమైనవి. అర్జునునికి కృష్ణుడు అది పురుషుడని ప్రస్తుతము తాత్కాలికముగా వి శ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడని తెలియును. అందువలన నారాయణ రూపాన్ని చూపమని కోరెను. ఈ శ్లోకము శ్రీమద్భాగవతపు వచనాన్ని చక్కగా సమర్థిస్తున్నది. అక్కడ శ్రీకృష్ణుడు ఆది పురుషుడని, ఆయన అన్ని అవతారాలకు మూలమని చెప్పబడినది. శ్రీకృష్ణునికి మిగిలిన అవతారాలకు ఏమీ తేడా లేకపోవుటయే కాక ఆయన అన్ని రూపాలలోనూ భగవంతుడే. అంతేకాక అతడు ఎప్పుడూ నవయవ్వనుడుగానే ఉంటాడు. ఇలా కృష్ణున్ని తెలుసుకున్న వ్యక్తి భౌతిక ప్రపంచపు కల్మషము నుండి వెంటనే ముక్తుడవుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement