Tuesday, May 7, 2024

ప్రతిసారీ కేసీఆర్ ను అవమానిస్తున్న మోడీ .. బాల్క సుమన్

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మోడీ హాజరయ్యే అధికారిక కార్యక్రమాలకు సైతం కేసీఆర్ ను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. రామగుండం ఎరువుల కార్మాగారం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను నామమాత్రంగా ఆహ్వానించడం సరికాదన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇంకెన్నాళ్లు గుజరాతీల చెప్పులు మోస్తారని ప్రశ్నించారు. తెలంగాణపై మోడీ కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, నవోదయ విద్యాలయాలు ఇస్తామని మోడీ ప్రకటించాలన్నారు. సింగరేణిపై మోడీ కళ్లు పడ్డాయని, తన దోస్తులకు సింగరేణి అమ్మేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయమని దమ్ముంటే మోడీ రామగుండంలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రామగుండం హైదరాబాదు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలన్నారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement