Friday, May 17, 2024

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి..

విఠల్‌నగర్‌: రామగుండం నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ని ఫైట్‌ ఫర్‌ బెటర్‌ సొసైటీ నాయకులు కోరారు. మంత్రిని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏళ్ల తరబడి ప్రజా ప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారం కావడం లేదని సొసైటీ- అధ్యక్షులు మద్దెల దినేష్‌, ఉపాధ్యక్షులు మాదిరెడ్డి నాగారాజ్‌, కందుకూరి రాజరత్నంలు వివరించారు. పారిశ్రామిక ప్రాంతం మునిసిపాలిటీ- నుండి కార్పొరేషన్‌గా మారి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కలిసి ఓసిపి 5 పేరుతో గోదావరిఖని ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చి స్మశానాన్ని తలపించేలా చేస్తుందన్నారు. మెగా ఓసిపి 5 ప్రాజెక్ట్‌ నిలిపివేయాలని కోరారు. అలాగే ఖని ప్రాంతంలో మెడికల్‌ కలశాల ఏర్పాటు- చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు దాని ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. ఇప్పటి-కై-నా ప్రభుత్వంతో చర్చించి ఏర్పాటు- చేయాలని కోరారు. గోదావరి నదిలో నీరు అంత కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, త్వరితగతిన నీటి శుద్ది కేంద్రాల ఏర్పాటు- చేయాలని, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకుజవహర్‌ నవోదయ విద్యాలయం ఏర్పాటు- చేయాలన్నారు. ఏళ్ల తరపడి రేషన్‌ కార్డులు లేక అర్హులైన పేదలు ప్రభుత్వ పధకాలను పొందలేక అనేక అవస్థలు పడుతున్నారని, అర్హులకు రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement