Friday, May 3, 2024

స్వచ్ఛతను కాపాడుకుందాం

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛతలో ఉన్న స్థానాన్ని కాపాడుకునేందుకు మండలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుందామని ఎంపీపీ నూనెటి సంపత్‌, జెడ్‌పిటిసి వంగల తిరుపతిరెడ్డి లు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కునారం క్లస్టర్‌లో గల రైతు వేదికలో కునారం, వెన్నంపల్లి, మంగపేట, జాఫర్‌ ఖాన్‌పేట్‌కి చెందిన సర్పంచులు, కార్యదర్శులు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ పంచాయతీల సిబ్బందికి తడి పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేసి కంపోస్టు ఎరువు తయారుచేసే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలంతా సమిష్టి కృషి చేస్తేనే గ్రామాలనుస్వచ్ఛత గ్రామాలుగా ఉంచడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, పంచాయతీలకు నిధులను నేరుగా కేటాయిస్తుందన్నారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తద్వారా ఆర్థిక అభివృద్ధి చెందుతారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషన్‌ నాయక్‌, జిల్లా కో- ఆర్డినేటర్‌ రాఘవులు సర్పంచులు డొంకెన విజయ మిగిలి, బుర్ర మంగ సదానందం, కాసం శ్రీనివాసరెడ్డి, దొమ్మటి శ్రీనివాస్‌, ఎంపీటీ-సీలు కొల్లురి రమ రాజమల్లు, జెట్టి దేవయ్య, ఏపీఎం సంఘ సదానందం, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, శైలజ, రాజు కుమార్‌, రమ్య, సీసీలు, అంగన్వాడి టీ-చర్లు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement