Monday, April 29, 2024

అద్భుతంగా నాగలింగేశ్వర స్వామి ఆలయం : రామగుండం సీపీ

నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం రాయినేడు గ్రామంలో నిర్మించిన ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం పురాతన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని శైవ క్షేత్రంగా మార్చారన్నారు. ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి ఏసిపి మహేష్, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, శ్రీనివాస్, మౌనికలతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement