Friday, May 10, 2024

స‌మ‌గ్ర భూ స‌ర్వే ఎన్నిక‌ల త‌ర్వాతే ….

తెలంగాణలో మాత్రం సమగ్ర భూ సర్వే ఎనిమిదేళ్లుగా వాయి దాల పర్వం కొనసాగిస్తున్నది. డిజిటల్‌ ఇండియా ప్యాకేజీలో భాగ ంగా కేంద్రం రూ. 83కోట్లను, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000కోట్లు తొలుత కేటాయించారు. 33 జిల్లాల్లో జిల్లాకో గ్రామం చొప్పున పైలెట్‌గా సర్వేకు నిర్ణయించినా ఏజెన్సీల నిర్వాకంతో కొంత జాప్యం నెలకొంది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భూ సమస్యలకు వచ్చే ఏడాదిలో సంపూర్ణంగా చెక్‌ పడనున్నది. సమగ్ర భూ సర్వే ఊసు ఇక వచ్చే ఏడా దిలోనే వెలుగులోకి రానున్నది. ఆ దిశగా సర్కార్‌ రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదితో ఈ ప్రాజెక్టుకు మళ్లి రెక్కలు రానున్నయి. 2021 జూన్‌ 11న ప్రారంభం కావాల్సిన సర్వే పనులు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతోపాటు, పథకాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడంతో భూ సర్వేపై పెద్దగా ప్రాముఖ్యత కనిపించ డంలేదు. కాగా, ధరణి పోర్టల్‌ ప్రారంభమైన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టకుండా కేవలం రికార్డు టూ రికార్డ్‌ పద్దతిలో భూ రికార్డుల ప్రక్షా ళన చేపట్టడం, వాటి ఆధారంగానే ధరణి పోర్టల్‌లో డేటా మొత్తం నిక్షి ప్తం చేయడంతో అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. పలు రకాల సమ స్యలతో ప్రజల నిత్యం ఏదోఒక భూ సమస్యను ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి., రికార్డులలో ఉన్న భూమికి భారీ వ్యత్యాసాలు నెలకొనడం, ఇతర రకాల పొజిషన్‌ సమ స్యలు ఎదురవుతుండటం ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తోంది.

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వుకు సీఎం కేసీఆర్‌ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే హామీనిచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కార్యాచరణ చేపట్టారు. అయితే భూ సర్వేకు సుధీర్గ సమయం పట్టే అవకాశం, ఈ సమస్యను ఒకేసారి కదిపితే ఎదురయ్యే ఇతరత్రా సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. అయితే రైతుబం ధును అమలు చేసి తీరాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పంతో సమస్యలను పక్కనపెట్టి భూ రికార్డుల ప్రక్షాళన హడావుడిగా పూర్తి చేయించారు. 2018 ఎన్నికల ప్రచారంలో రెవెన్యూ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కార ణంగా భూ సర్వే వాయిదా పడింది. 2020 జూన్‌ 11లో రాష్ట్రవ్యా ప్తంగా శాంపిల్‌గా పలు గ్రామాలను ర్యాండమ్‌ విధానంలో పైలెట్‌ సర్వే చేయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించినా అది ఆచరణలోకి రాలేదు. నిర్దేశిత తేదీనాటికి గ్రామాల ఎంపిక పూర్తికాకపోవడం, సర్వే ఏజెన్సీల దరఖాస్తుల గడువు పెంపు వంటి కారణాలతో సమగ్ర భూ సర్వే కార్యరూపంలోకి రాలేదు. ఏజెన్సీల గుర్తింపు, పైలెట్‌ గ్రామాల గుర్తింపు పూర్తికాలేదు.
అయితే సమగ్ర భూ సర్వేకు నిధుల వినియోగంపై కూడా అయో మయం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే భూ సర్వే చేయా ల్సిన నేపథ్యంలో ఇందుకు అనువుగా చట్టాలను సవరించాల్సి ఉంది. కేంద్ర సాయం కూడా ఇందుకు తప్పనిసరికాగా రాష్ట్ర ప్రభుత్వం స్వయ ంగా సర్వే చేసుకుంటామని, ఇందుకు ఎవరి సాయం అక్కర్లేదని తెలి పింది. సమగ్ర సర్వేకు రూ. 600కోట్లు అవుతాయని అంచనా వేశారు.

కొలతలు ఇలా…
ప్రతీ గ్రామానికి ఒక పటం, ప్రతీ భూ విభాగానికి కొలతలు, హ్ద్దురాళ్ల వివరాలతో టిప్పన్‌ తయారు చేస్తారు. ఆ తర్వాత భూమి రకం ఏమిటీ, ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? ఇతర విభాగమా ? తదితర వివరాలతో సేత్వార్‌ తయారు చేస్తారు. కొనుగోలు, వారసత్వం, భాగపంపకాలు, దానం, బహుమతి, వీలునామాతో భూమి సంక్రమిస్తే హక్కుల రికార్డులలో మార్పులు చేసి పట్టా జారీ చేస్తారు. తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సమస్యలు వీటిచుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 56శాతం కుటుంబాలకు గుంట భూమికూడా లేకపోగా, భూమి 40 శాతం కమతాల్లో గుంటకో సమస్యగా నెలకొంది. భూమి ఉంటే పట్టా లేకపోవడం, పట్టా ఉంటే భూమి ఆధీనంలో లేకపోవడం వంటివి నిత్యకృత్యంగా మారాయి. హైదరాబాద్‌ సంస్థానంగా చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో 1911లో మొదలైన సమగ్ర భూ సర్వే 1940లో పూర్తి చేశారు. ప్రతీ గ్రామానికి ఒక మ్యాప్‌, ప్రతీ విభాగానికి కొలతలు, హద్దులతో కూడిన టిప్పన్లు రెడీ చేశారు. ఆ తర్వాత సేత్వార్‌ రూపొందించారు. అప్పటి టిప్పన్లలో అనేకం అంటే దాదాపుగా 80శాతం రికార్డులు చెదలు పట్టడం, గ్రామ పటాలు చిరిగిపోవడం, వంటి వాటితో భూముల క్రయవిక్రయాల్లో అవాం తరాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సర్వే లేకుం డానే కాలక్రమేణా కాగితాలపైనే సబ్‌ డివిజన్‌ చేసి కొత్త సర్వే నెంబర్లు ఇస్తూ వచ్చారు. కోర్టుల్లో వివాదాలు నడుస్తున్న వాటిలో 80శాతం భూ హద్దులు, రికార్డులకు చెందిన సమస్యలే కావడం గమనార్హం.

- Advertisement -

ఎనిమిదేళ్లుగా…
తెలంగాణలో మాత్రం సమగ్ర భూ సర్వే ఎనిమిదేళ్లుగా వాయి దాల పర్వం కొనసాగిస్తున్నది. డిజిటల్‌ ఇండియా ప్యాకేజీలో భాగ ంగా కేంద్రం రూ. 83కోట్లను, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000కోట్లు తొలుత కేటాయించారు. 33 జిల్లాల్లో జిల్లాకో గ్రామం చొప్పున పైలెట్‌గా సర్వేకు నిర్ణయించినా ఏజెన్సీల నిర్వాకంతో కొంత జాప్యం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement