Monday, May 6, 2024

కారణజన్ముడు కేసీఆర్.. ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అవరణలో కేసీఆర్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశ ప్రజలందరికీ విస్తరించాలని కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని స్థాపించారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement