Thursday, May 9, 2024

అభివృద్ధికి ఆక‌ర్షితులై బీఆర్ఎస్ లో చేరిక‌లు : మంత్రి గంగుల‌

తెలంగాణ సంక్షేమ ప‌థ‌కాలు, రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధికి ఆక‌ర్షితులై కాంగ్రెస్‌, బీజేపీల నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నార‌ని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో బీజేపీ, కాంగ్రెస్ నుండి మంత్రి గంగుల సమక్షంలో బీఆర్ఎస్ లో నాగులమల్యాల సర్పంచ్ నాయిని ప్రసాద్, కమాన్ పూర్ మాజీ సర్పంచ్ బోనాల మనోహర్, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ బొమ్మ ఈశ్వర్ గౌడ్, పలువురు వార్డు మెంబర్లు, 200 మంది కార్యకర్తలు చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement