Sunday, May 19, 2024

పసిఫిక్ మహాసముద్రం అడుగున పెద్ద రంధ్రం.. భ‌విష్య‌త్ లో భూకంపం

భ‌విష్య‌త్ లో పెద్ద భూకంపం రానుంద‌ట‌.. కార‌ణం ఏంటంటే.. పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగాన పెద్ద రంధ్రం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల భవిష్యత్ లో పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లీకేజీకి సంబంధించిన ఓ ఫొటోను వాషింగ్టన్ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వారు తెలిపిన ప్రకారం అమెరికా తీరంలోని ఒరెగాన్ సమీపంలో కాస్కాడియా సబ్ డక్షన్ జోన్ ఫాల్ట్ వద్ద ఈ హోల్ పడిందని వారు పేర్కొంటున్నారు. దీనికి వారు ‘ఫైథియాస్ ఒయాసిస్’ అని పేరు పెట్టారు. మంచి నీటిని పోలి ఉండే ఒక విధమైన నీరును కనుగొన్నామని 2015 సంవత్సరంలో దీని గురించి అడ్వన్సెస్ జర్నల్ లో ప్రచురించారని శాస్త్రవేత్తలు వివరించారు.యితే ఇవి కేవలం మీథేన్ బుడగలు కాదు అని సముద్రం భూ గర్భం నుంచి వస్తున్న అగ్ని హోస్ లాంటిదని ‘ఓషనో గ్రఫీ ’ ‘సీప్లూర్ జియాలజీ’ స్పెషలిస్టు అసోసియేట్ ప్రొఫెసర్ ఇవాన్ సోలమన్ ఒక ప్రకటనలో తెలిపారు. తాను దీనిని ఎప్పుడూ చూడలేదని ఇది అరుదైన విషయమని ఆయన తెలిపారు.

ఈ బుడగల ద్వారా బయటకు వచ్చే ద్ర‌వం -8.8 డిగ్రీల సెల్సీయస్ చుట్టూ ఉన్న నీటి కంటే వెచ్చగా ఉంటుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ద్రవం నేరుగా కాస్కాడియా మెగా థ్రస్ట్ నుంచి వస్తోందని ఇక్కడ ఉష్ణోగ్రతలు 150 నుంచి 250 డిగ్రీల సెల్సీయస్ గా నమోదవుతాయట‌. మరి ఇది భూకంపాలని ఎలా కారణమవుతుందన్న నేపథ్యంలో వారు మాట్లాడుతూ అవక్షేప కణాల మధ్య ద్రవ ఒత్తిడిని తగ్గించి ఖండాంతర పలకల మధ్య ఘర్షణ పెంచుతుందని ఫలితంగా భూకంపం కేంద్రీకృతమవుతుందని వారు అన్నారు. మెగాథ్రస్ట్ ఫాల్ట్ జోన్ ఎయిర్ హాకీ టేబుల్ లాంటిదని సోలమన్ వివరించారు. ద్రవ పీడనం ఎక్కువగా ఉంటే గాలి ప్రారంభై తక్కువ ఘర్షణ మొదలవుతుంది. ద్రవపీడనం తక్కువగా ఉంటే రెండు ప్లేట్లు ఎక్కువగా రిలాక్స్ అవుతాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇలాంటి లీక్ ఇప్పటివరకు జరగలేదని ఇదే మొదటిదని పరిశోధకులు అంటున్నారు.పసిఫిక్ మహా సముద్రం ట్రెంచ్ లో 8336 ఎత్తులోని చేపలను ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని అడుగు భాగాన్ని లూబ్రికెంట్ అని పిలుస్తారు. ఈ అడుగుభాగం కింది పొర ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. అక్కడి నుంచి ఊహించని బుడగలు వస్తుంటాయి. ఇది ప్రమాదానికి సంకేతం. ఇప్పుుడు ఆ బుడగలను చూశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ పరిశోధనలో భాగంగా దీనిని కనుక్కోవడానికి రోబోట్ ను ఉపయోగించామని వారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement