Friday, May 3, 2024

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే… కరీంనగర్ సీపీ

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి మద్యం తాగిన వారు మృతి చెందడంతో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇకపై కమిషనరేట్ పరిధిలో తరచూ బ్రీత్ అనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, ఏసీపీలు కరుణాకర్ రావు, శ్రీనివాసరావు, ప్రతాప్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement