Sunday, April 28, 2024

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే : సీపీ సుబ్బారాయుడు

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు హెచ్చరించారు. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోని సమావేశ మందిరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు జరిగి మృతి చెందడంతో పాటు క్షతగాత్రులు అవుతున్నారన్నారు. కమిషనరేట్ పరిధిలో తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిసిపి శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసిపి విజయ్ కుమార్ తో పాటు పలువు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement