Sunday, April 28, 2024

సిరిసిల్ల జిల్లాలో జోరుగా వానలు.. కలవరంలో రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానలు జోరుగా కురుస్తుండడంతో రైతన్నలు కలవర పడుతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానలతో రైతులు వరినాట్లు వేస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిగతా మూడు జిల్లాల కంటే అత్యధికంగా నమోదు అవుతుండటంతో పత్తి చెనులకు వరదనీరు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇవాళ ఉదయం 10గంటల వరకు సిరిసిల్లలో 3.35 సెంటిమీటర్ల, జగిత్యాలలో 1.65, పెద్దపల్లిలో 1.46, కరీంనగర్ జిల్లాలో 1.42 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.

రాగల మూడురోజులు తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు ఆరేంజ్
అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్ లను అప్రమత్తం చేశారు. మిడ్ మానేరుకు 3000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. డ్యామ్ సామర్థ్యం 27టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.7 టీఎంసీలకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement