Thursday, May 2, 2024

కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రెట్టింపు : ఎమ్మెల్యే దాసరి

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం లో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం పొందిన మహిళలకు నగదుతో పాటు కిట్ అందిస్తున్నామన్నారు.

గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే జంకే జనం ప్రస్తుతం క్యూ కడుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యాల సునీత, ఎంపీపీ బాలాజీ రావు, శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి ప్రమోద్ కుమార్, వైద్యులు శ్రీరామ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, గర్భిణీ మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement