Wednesday, May 15, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. కలెక్టర్ సంగీత

ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారన్నారు.

రైతులు తమ కులాల వద్ద స్టార్టర్లు నీటిలో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, కమిషనర్ తిరుపతి, ఏసిపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ లు రాజేష్, మహేందర్ తో పాటు పలువురు అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement