వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో రాజన్న ఆలయానికి తరలివచ్చారు. శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక కరోనా సమయంలో మూతపడిన ధర్మగుండం ఆదివారం (నిన్న) పున:ప్రారంభించారు. దీంతో ధర్మగుండంలో స్నాన్నాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం..

Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement