Thursday, April 25, 2024

కార్తికేయ తాజా చిత్రం.. హీరోయిన్ గా నేహాశెట్టి.. పోస్ట‌ర్ రిలీజ్

వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు హీరో కార్తికేయ‌.. ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రానికి బెదురులంక‌2012అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు మేక‌ర్స్. నేహా శెట్టి హీరోయిన్ .. క్లాక్స్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ నేహా శెట్టి పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ లో నేహా శెట్టి చాలా హాట్‌గా కనిపిస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..“కామెడీ డ్రామాగా.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారని దర్శకుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement