Sunday, April 28, 2024

లేక్ పోస్ట్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసిన సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్, (ప్రభ న్యూస్) : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువతులను రక్షించిన లేక్ అవుట్ పోస్ట్ ఆర్ యస్ఐ, సిబ్బందికి సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు నగదు రివార్డును అందజేసి అభినందించారు. ఈనెల 15న దిగువ మానేరు జలాశయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువతులను లేక్ పోలీసులు రక్షించిన విషయం విధితమే. ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ ఎ.సురేష్, సిబ్బంది వీరాస్వామి, సఫ్దర్ అలీ, కానిస్టేబుళ్ళు కీలకపాత్ర పోషించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు చేసే ప్రతి మంచి పనికి అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులు, అవార్డులు అందజేస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ జి.చంద్రమోహన్, మహేష్ బాబాసాహెబ్, లేక్ అవుట్ పోస్ట్ ఆర్ఎస్ఐ ఎ.సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement