Saturday, May 4, 2024

కొనసాగుతున్న కోవిడ్‌ టెస్టులు

ఓదెల : మండల కేంద్రమైన ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్‌ టెస్టులు కొనసాగుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది కోవిడ్‌ పరీక్షలు చేశారు. ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 12 మందికి -టెస్టులు నిర్వహించగా కొమిర గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. గత ఐదు రోజుల క్రితం ఓదెలకు చెందిన ఒకరికి, తాజాగా మంగళవారం మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు- ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఓదెల ఆసుపత్రి డాక్టర్‌ చక్రధర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, అందరూ జాగ్రత్త వహించాలని కోరారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్‌ పెరుగుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి కుటు-ంబాలను రక్షించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement