Tuesday, May 7, 2024

కుట్రలు పన్నుతున్నారు.. సంయమనం పాటించాలి : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 2018 అనంతరం చెన్నూరు నియోజకవర్గ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదంతో జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంటే ఓర్వలేని కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్ని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తూ రెచ్చగొడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు కవ్వింపు చర్యలకు లోనుకావొద్దని, సంయమనం పాటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement