Thursday, May 2, 2024

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్… మంత్రి గంగుల కమలాకర్

పేదలకు ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంత్రి మీ సేవ కార్యాలయంలో శుక్రవారం 76మందికి రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పలు వైద్య ఖర్చుల కింద సీఎంఆర్ఎఫ్ పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement