Wednesday, May 15, 2024

అటవీ అనుమతులు తీసుకువస్తాం..

మేడిపల్లి: మోత్కూరావుపేట- చందుర్తి రోడ్డు పనులు ఆలస్యం కావడం పట్ల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రం నుండి చందుర్తి అటవీ ప్రాంతంలోని గండి మైసమ్మ వరకు చేపట్టదలిచిన మహా పాదయాత్ర కార్యక్రమాన్ని చందుర్తి పోలీసులు అడ్డుకోవడంతో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి ఆది శ్రీనివాస్‌ని, కార్యకర్తల్ని అరెస్టు చేయడం పట్ల మండలంలోని మోత్కూరావుపేట గ్రామంలో రోడ్డు పనుల కోసం వేసిన శిలాఫలకం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏళ్ళు గడుస్తున్నా పనులలో ఎలాంటి పురోగతి లేదని, అటవీ అనుమతులు రావడం లేదని కుంటిసాకులు చెబుతూ అనుమతుల పేరిట జాప్యం తగదన్నారు. మోత్కూరావుపేట నుండి చందుర్తి అటవీ ప్రాంతంలోని రోడ్డు పనులు మొదలు పెట్టాలని లేకుంటే రోడ్డు పనుల ఫైల్‌ ఇస్తే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మేం బెంగుళూరుకు వెళ్లి అటవీశాఖ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకు వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పసునూర్‌ సర్పంచు మలోత్‌ లచ్చనాయక్‌, గోవిందారం మాజీ సర్పంచ్‌ తోకల నర్సయ్య, జంగపెళ్లి విజయ్‌, వనపర్తి దేవయ్య, దాసరి గణేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement