Friday, April 26, 2024

ఆసరాతో భరోసా, అందరికీ బతుకమ్మ చీరలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఆసరా పింఛలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి, పిట్టల ఎల్లయ్య పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులతో పాటు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 46లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.

గత పాలకుల హయాంలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ కేసీఆర్‌ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత భారీగా పింఛన్లు లేవని విమర్శించారు. అభివృద్ధిలో తెలంగాణను మేటిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు కేసీఆర్ ఆని, అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్‌ తప్పక ఇస్తామ‌న్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ అందజేస్తామన్నారు. బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement