Thursday, May 2, 2024

హైదరాబాద్ లో అల్లర్లకు సీఎం మరో కుట్ర : బండి సంజ‌య్

ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో మరో రెండ్రోజుల్లో హైదరాబాద్ లో మత ఘర్షణలు లేవనెత్తడానికి కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తన బిడ్డ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో… ఆ చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ కుట్రకు తెరతీశాడన్నారు. తన బిడ్డను కాపాడుకునేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేయించి అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా… రాళ్లు, రాడ్లు విసిరినా ప్రజా సంగ్రామ యాత్ర ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ పాలనను బొంద పెట్టే వరకు పాదయాత్ర కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటాంరు. అందులో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 27న జరిగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్భంధాలపై ఈరోజు కరీంనగర్ లోని తన నివాసంలో బండి సంజయ్ ‘‘ నిరసన దీక్ష’’ చేపట్టారు.

దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ దీక్షలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ నేత దాసోజు శ్రవణ్, జిల్లా అధ్యక్షులు గంగిడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లో ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా అడ్డుకున్నరో ప్రజలు చూశారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయన్నారు. సీఎం కుటుంబంపై లిక్కర్ స్కాం ఆరోపణలొస్తున్న నేపథ్యంలో దారి మళ్లించడానికే పాదయాత్రను అడ్డుకున్నారని. ఇది ప్రజందరికీ అర్ధమైందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement