Tuesday, May 7, 2024

Kalyana Laxmi – పేదింటి ఆడ‌బిడ్డ‌ల కుటుంబాల‌లో వెలుగు కోస‌మే క‌ల్యాణ లక్ష్మీ – మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలో కల్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మనురైన 34 మంది లబ్ధిదారులకు గాను రూ.34.03 లక్షల చెక్కులను, చీరలను మంత్రి పువ్వాడ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు.

పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
ఈ పథకం ద్వారా నేటి వరకు నియోజకవర్గంలో 8460 చెక్కులకు గాను 79.67 కోట్ల రూపాయలు పంపిణి చేయడం గర్వంగా ఉందన్నారు. అనంతరం లబ్ధిదారుల కోసం ఎర్పాటు చేసిన భోజనంలో వారికి స్వయంగా వడ్డించారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ దోరెపల్లి శ్వేత, కార్పొరేటర్ లు రావూరి కరుణ, దండా జ్యోతి రెడ్డి, పసుమర్తి రాంమోహన్, మెడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ళ నిరీష రెడ్డి, చామకురి వెంకన్న, నాయకులు షౌకత్ అలీ, శీలంశెట్టి వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, కన్నం ప్రసన్న కృష్ణ, షకీన తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement