Thursday, September 21, 2023

కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం.. ఎమ్మెల్యే రసమయి

తెలంగాణలోని నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటివని రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ పండ్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు ఆడబిడ్డ పుట్టిందంటే నెత్తిమీద కుంపటిగా తల్లిదండ్రులు భావించేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఆడబిడ్డ పుడితే అదృష్ట లక్ష్మిగా భావిస్తున్నారన్నారన్నారు.

- Advertisement -
   


ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ ముదసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్ల వంశీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేమిడి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల పురం అధ్యక్షులు గోపు రవీందర్ రెడ్డి, మానకొండూర్ సొసైటీ చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, నాయిబ్ తహసీల్దార్ నవాజ్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement