Saturday, May 18, 2024

Kaleru Warns – రైతుల సంక్షేమాన్ని అడ్డుకుంటే తాట‌తీస్తాం – రేవంత్ కు ఎమ్మెల్యే కాలేరు వార్నింగ్

రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి వర్యులు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అంబర్ పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అంబర్ పేట ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొని కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అన్న నినాదాలతో హోరెత్తించి పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ల దిష్టిబొమ్మల దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ ను పొందుతూ, అత్యధిక పంటలు పండిస్తూ రాష్ట్రాన్ని అన్నపూర్ణలాగా మారుస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ముందుకి వస్తోందని అది రేవంత్ రెడ్డి మాటలతో బయపడిందని ఫైర్ అయ్యారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడినా, వారి సంక్షేమాన్ని అడ్డుకున్నా తాము ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి తన పిచ్చి ప్రేలాపనాలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement