Monday, April 29, 2024

కోయపోచగూడలో జాయింట్‌ చెక్‌పోస్టు.. పోలీసు, అట‌వీ, రెవెన్యూ ప‌ర్య‌వేక్ష‌ణ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అటవీ ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్న మంచిర్యాల జిల్లా కోయపోచగూడ ప్రాంతంలో జాయింట్‌ చెక్‌ పోస్టును అధికారులు ఏర్పాటు చేశారు. పోలీసు, అటవీ, రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో ఈ చెక్‌పోస్టు పని చేస్తుంది. కొత్తగా అటవీ ఆక్రమణల ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కవ్వాల్‌ పులుల సంరక్షణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న కోయపోచగూడ పరిధిలో ఇప్పటి వరకు అసలు పోడు వ్యవసాయమే లేదని, కొత్తగా అడవిని నరికి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు ఉల్లంఘించవద్దని స్థానికులకు అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తామని, ఆక్రమణలను అడ్డుకుంటామని, గ్రామస్థులు సంయమనం పాటించాలని జన్నారం ఫారెస్టు డివిజనల్‌ అధికారి ఎస్‌.మాధవ రావు కోరారు. కోయపోచగూడ సమీవంలో ఉన్న అటవీ బేస్‌ క్యాంపును కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement