Sunday, December 8, 2024

RR : ఎమ్మెల్యే ప్రసాద్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక‌లు

వికారాబాద్, డిసెంబర్ 13 (ప్రభ న్యూస్): మాజీ మంత్రి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో వికార భగత్ మున్సిపల్ చైర్ ప‌ర్సన్ మంజుల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్‌లో 31 చెందిన మాలే గాయత్రి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బుధవారం ఉదయం గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ ప‌ర్సన్ చిగుళ్లపల్లి మంజుల, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, వికారాబాద్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నాయకులు దీపు లక్ష్మణ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement