Friday, April 26, 2024

దేశంలో పీపుల్స్ ఫ్రంట్ వస్తేనే బాగుటుంది: రాకేశ్ టికాయత్

దేశ రాజకీయాల్లో బలమైన పోటీ ఉండాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసర ఉందని బీకేయూ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ అన్నారు. గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ తో రాకేశ్ టికాయత్ ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ సుబ్రహమణ్యం స్వామి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు 4 గంటల పాటు వీరు సమావేశం అయ్యారు. సమావేశ అనంతరం బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని ఆకాంక్షించారు. రైతులకు కేంద్రం ఇస్తున్న పంట సాయం కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు ఎక్కువగా ఉంటుందని ఆయ‌న తెలిపారు. సీఎం కేసీఆర్ తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయ అంశాలపై చర్చించలేదని రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.

రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సహాయం, చనిపోయిన రైతుల జాబితా గురించి మాట్లాడుకున్నట్లు రాకేశ్ టికాయ‌త్‌ తెలిపారు. మార్చి 10 తరువాత జాబితా పంపిస్తాం.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఉద్యమంలో చనిపోయారని వారి వివరాలను సంయుక్త కిసాన్ మోర్చా తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుందని రాకేశ్ పేర్కొన్నారు. దేశంలో రైతు డిమాండ్ల కోసం మార్చి 10 తరువాత దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్లి రైతులను కలుస్తామని.. రైతు సమస్యలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తామని రాకేశ్ టికాయత్ తెలిపారు. యూపీలో బీజేపీపై వ్యతిరేకత ఉందన్న రాకేష్ టికాయత్.. రానున్న రోజుల్లో పీపుల్స్ ఫ్రంట్ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement