Friday, May 3, 2024

IT Raids: తెలంగాణలో పలుచోట్ల ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు కంపెనీలు, వ్యక్తులపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు గత కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్నారు. అయితే తాజాగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌తో పాటు రాయదుర్గం, మొయినాబాద్‌, కోకాపేటలో ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. ఒక ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు ఉదయం నుంచి 9 చోట్ల సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement