Saturday, May 4, 2024

ప్ర‌భుత్వ‌ వైద్య సేవలపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెంచాం: ఎంపీ పసునూరి

జనగామ (ప్రభన్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం రాకతోనే వైద్యంపై దృష్టి పెట్టామని, నిరుపేదలకు మరింత అందుబాటులోకి తెచ్చామని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ కమిటీ) చైర్మన్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని దిశ కమిటీ సెక్రటరీ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 18 అంశాలపై సమీక్షించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్య‌మిచ్చామ‌ని, రహదారులు, మహిళా శిశు సంక్షేమం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆసరా పెన్షన్ లు, హరితహారం, జాతీయ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, పల్లె, పట్టణ ప్రగతి సెగ్రిగేషన్, వైకుంఠ దామాలు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా దిశ కమిటీ చైర్మన్ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతోనే నిరుపేదలకు ప్రభుత్వ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అందించాలని హాస్పిటల్ లను సంస్కరించమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement