Monday, April 29, 2024

MDK: నాడు ఉద్యమంలో… నేడు అభివృద్ధిలో అగ్రస్థానంలో సిద్దిపేట… హరీశ్ రావు

సిద్దిపేట : నాడు ఉద్యమంలో, నేడు అభివృద్ధిలో అగ్రస్థానంలో సిద్ధిపేట ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో పట్టణంలోని పలు సామూహిక భవనాల మంజూరు పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… నాడు ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు పాల్గొన్న రోజుల్లో ప్రతిపక్షాలు ఎక్కడున్నాయ్.. ఉద్యమం చేసిన గడ్డ సిద్దిపేట.. నాడు ఉద్యమంలో ముందున్నం… అభివృద్ధిలో కూడా తాము ముందుటామని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. అన్ని సిద్దిపేట, గజ్వేల్ నేనా అభివృద్ధి అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు… సిద్దిపేట తెలంగాణ ఉద్యమ గడ్డ, సిద్దిపేట ప్రజలు రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాడు, జైలుకు పోయిన నాడు, ధర్నాలు చేసిన నాడు ఈ ప్రతిపక్షాలు ఎక్కడ పోయాయి.. ఉద్యమం చేసినం అభివృద్ధి చేసుకుంటాం.. మీ సమైక్య పాలనలో ఈ ప్రాంతం గోస పడ్డదన్నారు.

సిద్దిపేట ప్రజలు ప్రతిపక్షాలను ప్రశ్నించాలన్నారు. 60ఏళ్లలో లేని అభివృద్ధి ఈ తొమ్మిది ఏళ్ళలో ఎవరు చేశారని కాంగ్రెస్, బీజేపీ వాళ్ళను అడగాలన్నారు. సిద్దిపేట ఎన్నో దశాబ్దాల కలలు సిద్దిపేట జిల్లా.. గోదావరి జలాలు, రైలు నెరవేరాయ్.. ఈనెల 15న బుల్లేట్ స్పీడ్ తో సిద్దిపేటకు రైలు రాబోతుందన్నారు. సిద్దిపేటలో రైలు ఎక్కితే హైదరాబాద్, తిరుపతి, బెంగుళూరుకు పోతామన్నారు. సిద్దిపేట ప్రజలు ఎక్కడికి వెళ్లినా గౌరవం, ప్రతిష్ట పెంచామన్నారు. సిద్దిపేట అభివృద్ధి బాగా లేదని ఎవరూ అనడం లేదు.. కానీ అభివృద్ధి చూసి ఓరుస్తలేరు అంటే ఆ స్ధాయి అభివృద్ధిని మనం చేసుకున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు గొప్ప చైతన్య వంతులన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు.

  • సాముహిక భవనాల మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి హరీష్ రావు…

పట్టణంలో ఒకటవ వార్టులో విశ్వకర్మ భవనంకు రూ.5లక్షలు, శాలివాహన భవనం రూ.5లక్షలు, 2వ వార్డ్ లో ముదిరాజ్ భవనంకు రూ.10లక్షలు, రెడ్డి సంఘంకు రూ.15లక్షలు, 4వ వార్డులో ఒడ్డెర సంఘంకు రూ.10లక్షలు, 10వ వార్డులో గౌడ సంఘంకు రూ.10లక్షలు, 12వ వార్డులో నాయి బ్రాహ్మణకు రూ.20 లక్షలు, నీలకంఠ యూత్ రూ.5 లక్షలు, 15వ వార్డు బిరప్ప భవన్ కు రూ.6లక్షలు, జంగం భవన్ కు రూ.15లక్షలు, 30వ వార్డులో కిచెన్ షేడ్ నిర్మాణానికి రూ.25లక్షల మంజూరు పత్రాలను ప్రతినిధులకు మంత్రి హరీష్ రావు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement