Saturday, December 7, 2024

KNR: కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో అంధకారమే.. మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లా : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రంలో అంధకారమే ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి గంగుల 125మంది లబ్ధిదారులకు ఒక కోటి 25 లక్షల రూపాయల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… పేద వర్గాలకు న్యాయం చేసే పౌరసరఫరాల, బీసీ మంత్రిత్వశాఖలను సీఎం కేసీఆర్ తనకు కేటాయించారన్నారు. మంత్రిగా తన చేతుల మీదుగా వేలాది మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశానన్నారు.


పార్టీలకతీతంగా కల్యాణలక్ష్మి చెక్కులు అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డ పెండ్లికి అప్పులు చేయవద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు లేవన్నారు. గతంలో పథకాలు కాంగ్రెస్ పాలు… సీఎం కేసీఆర్ పాలనలో పథకాలు పేద ప్రజల పాలు అన్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి… ఒక్కసారి మాకు అధికారం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వస్తున్నాయని.. ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే తెలంగాణ అంధకరంగా మారుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement