Sunday, May 12, 2024

నేను ఇక్క‌డే పుట్టి పెరిగా..

హైదరాబాద్‌, : నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే.. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రాంతీయపార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న షర్మిల బుధవారం సాయంత్రం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీలేదన్నారు. కేసీఆర్‌,
విజయశాంతి ఇక్కడి వాళ్ళేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేనంత మాత్రాన.. తాను ఇక్కడిదా నిని కాదా? తెలంగాణపై ప్రేమ ఉండదా అని అన్నారు. తాను పార్టీ పెట్టడం అన్న జగన్‌కు ఇష్టంలేదని, అనుబంధా ల్లో మాత్రం తేడాలేదన్నారు. భిన్నాభిప్రాయాలో.. భేదాభి ప్రాయాలో తనకు తెలియదన్నారు. తమ మధ్య మాటలు.. అనుబంధాలు.. రాఖీలు ఉంటాయన్నారు. ప్రాంతం వేరైనా అన్నాచెల్లెల్లుగా తాము ఒకటేనన్నారు. తనకు వైసీపీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో అన్ననే అడగాలన్నారు.
ఉద్యమం అంటూ ఒకరు మతం అంటూ ఒకరు మాట్లాడుతున్నారని, తెలంగాణ అభివృద్దిపై ఎవరికీ చిత్తశుద్ది లేదన్నారు. తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం మృతిచెందిన అమరవీరుల ఆశయాలు గత ఆరున్నరేళ్ళలో సిద్దించాయా అని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలను కనీసం పరామర్శించారా? త్వరలోనే అమరవీరులను స్మరిస్తూ గడపగడపకు వెళ్తానన్నారు. దేవుడి దయ వల్ల తెలంగాణ వచ్చిందని, తెలంగాణ వచ్చాక ఇక్కడి ప్రజల సమస్యలు తీరాయా? అని ప్రశ్నించారు. పార్టీ ఏర్పాటు మే 14, జూలై 8 అనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.
రాష్ట్ర అభివృద్ది కోసం
అన్నను ఎదిరించేందుకు సిద్దం
తెలంగాణ అభివృద్దికోసం అవసరమైతే అన్నను ఎదిరించేందుకు సిద్దమని, పోలవరం నుండి పోతిరెడ్డిపాడు దాకా తెలంగాణ ప్రయో జనాలే తనకు ముఖ్యమని వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్నపథకాలనే కాపీకొట్టారన్నా రు. గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కన్నా ఉద్యోగాలపై దృష్టిపెట్టలేదన్నారు. రాజకీయపార్టీపై తన భర్త అనిల్‌ పూర్తి సహకారం ఉందన్నారు.
కోవిడ్‌ విషయంలో ఆస్పత్రులు లక్షలు వసూలుచేశాయని, ఆస్పత్రుల దోపిడీపై సీఎం దృష్టి పెట్టలేకపోయారన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్నారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, అమరవీరులను కలుస్తానన్నారు. లోటస్‌ పాండ్‌లోని తన నివాసం నుండే పార్టీ ప్రస్థానం ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌తో తనకు విడదీయరాని అనుభందం ఉందన్నారు. తన స్థానికత ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, జయలలిత ఎక్కడ పుట్టారు.. ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యారన్నారు.
మీ అక్కగా సమాజ బాగుకు ప్రయత్నిస్తా…..
నేను మీకోసం నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతా అని వైఎస్‌ఆర్‌ తనయ వైఎస్‌ షర్మిల అన్నారు. బుధవారం వివిధ యూనివర్శిటీల విద్యార్ధుల తో ఆమె సమావేశమ య్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుప్రజలను రాజశేఖరరెడ్డి గుండెల్లోపెట్టుకుని చూసుకున్నా రని, డబ్బులేని కారణంగా ఏ పేదవిద్యార్ధి చదువు ఆగిపోవొద్దని భావించారన్నా రు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా వెయ్యి కడితే ఎన్ని లక్షల ఫీజులైనా ప్రభుత్వం చెల్లించేదని, అలా చదువుకున్న ఎంతోమంది నేడు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వాళ్ళంతా ఎప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తుపెట్టుకుంటారన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్శిటీని తెచ్చిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. ఈ రోజు అందరికీ ఒక మంచి సమాజం కావాలని, తెలంగాణలో ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. అందరి నిరీక్షణ ఫలించాలంటే.. ఒక మంచి సమాజం రావాలన్నారు.
యువకుడు భావోద్వేగం.. షర్మిల ఓదార్పు
వైఎస్సార్‌ మృతిని తట్టుకోలేక తన తండ్రి మృతిచెందాడని, షర్మిలక్క ఉందనే ధైర్యం ఉందని.. సునాజ్‌ అనే హైదరాబాద్‌కు చెందిన యువకుడు భావోద్వేగానికి లోను కాగా, షర్మిల నేను ఉంటాను.. నేను మీకోసం నిలబెడతాను.. మిమ్మల్ని నిలబెడతాను అంటూ ప్రకటించారు. షర్మిలతో సమావేశమైన విద్యార్ధులు అక్క తమకు అండగా ఉంటుందన్న నమ్మకం కలిగిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement